గుంతకల్లు: పట్టణంలోని పాత గుంతకల్లులో కృష్ణ అనే వ్యక్తిని హత్య చేసిన లింగయ్య అరెస్ట్, వివరాలు వెల్లడించిన సీఐ మనోహర్
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లులో పాత శివాలయం వద్ద కృష్ణ అనే వ్యక్తిని హత్య చేసిన కురుబ లింగయ్య అనే ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్లు టూ టౌన్ ఇంచార్జ్ సీఐ మనోహర్ శుక్రవారం ఉదయం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పాత శివాలయం వద్ద ఈ నెల 6న మజ్జిగ కృష్ణ అనే వ్యక్తిని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన కురుబ లింగయ్య దారుణంగా హత్య చేశాడు. తన భార్యతో మజ్జిగ కృష్ణ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో రాడ్డుతో కొట్టి చంపాడు. పోలీసులు అరెస్ట్ చేశారు.