సిద్దిపేట అర్బన్: పాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు సమాచార హక్కు చట్టం దోహదం చేస్తుంది : జిల్లా కలెక్టర్ హైమావతి
ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు సమాచార హక్కు చట్టం 2005 చాలా దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో పిఐఓ లకు ఆర్టిఐ చట్టంపై కల్పిస్తున్న ఈ అవగాహన కార్యక్రమం చాలా ముఖ్యమైనదని జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర సమాచార కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆర్టిఐ చట్టం పై ప్రతి ఒక్క అధికారి పూర్తి అవగాహన పెంపొందించుకొని ఆర్టిఐ మార్గదర్శకాల ప్రకారం అధ