కనగల్: పచ్చదనంతో పర్యావరణానికి మేలు జరుగుతుంది: సీనియర్ అసిస్టెంట్ జీనుకుంట్ల చంద్రయ్య
నల్గొండ జిల్లా, కనగల్ మండల పరిధిలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద సీనియర్ అసిస్టెంట్ వినుకుంట్ల చంద్రయ్య శనివారం మధ్యాహ్నం పలు రకాల పూలు, పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పచ్చదనంతోనే పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కోరారు.