ఖమ్మం అర్బన్: ఖమ్మంలో కదులుతున్న ఎలక్ట్రిక్ కారులో మంటలు: తప్పిన పెను ప్రమాదం
ఖమ్మం కలెక్టర్ కార్యాలయం సమీపంలో కొత్తగూడెం వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కారు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.