ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం త్రవ్వ గుంట సమీపంలో కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు సంఘటనా స్థలంలోనే మృతి
Ongole Urban, Prakasam | Aug 1, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం త్రవ్వ గుంట గ్రామ సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన శనివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో రాజారావు అనే ప్రిన్సిపాల్ సంఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే స్టేషన్ నుంచి తన కుమారుడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. రాజారావు నాగులప్పలపాడు లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జరిగిన ప్రమాదం పై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.