బోధన్: రెంజల్ కందకుర్తి గోదావరి నదికి వరద ఉధృతి
గోదావరి నది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు రెంజల్ మండలం కందకుర్తి వద్ద వరద ప్రవాహం పెరిగింది. నదిలో నీటిమట్టం పెరిగి అంతరాష్ట్ర వంతెనపైనుంచి గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదనీరు పంటపొలాలను ముంచెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.