డోన్: డోన్ లో వైసీపీకి షాక్, యాభై కుటుంబాలు టిడిపిలో చేరిక
Dhone, Nandyal | Oct 3, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం చనుగొండ్ల మాజీ సర్పంచ్ దేవేంద్రతో పాటు సుమారు 40 కుటుంబాలు, ఇంద్రంపల్లెకు చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో పెరిగిన నమ్మకంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.