కొడిమ్యాల: నూక పల్లి ఎస్సారెస్పీ వరద కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,నూకపల్లి వరద కాలువలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం గురువారం మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు మృతదేహం కొట్టుకు వస్తోంది,అయితే ఇది గమనించిన స్థానికులు మల్యాల పోలీసులకు సమాచారం అందజేశారు,దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది కొట్టుకు వస్తున్న మహిళా మృతదేహాన్ని కెనాల్ నుండి బయటకు తీశారు,నూకపల్లి ఎస్సారెస్పీ కెనాల్ లో ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించిన ఓ మహిళ సుమారు 25 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉంటుందని పాక్షిక సమాచారం అందజేశారు, మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్,ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,