శ్రీశైలం: పుట్టుపల్లె గ్రామానికి చెందిన దళిత కుటుంబాల వ్యవసాయ మీటర్లను తొలగించేందుకు ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి
మహానంది మండలం, పుట్టుపల్లె గ్రామానికి చెందిన దళిత కుటుంబాల వ్యవసాయ విద్యుత్ మీటర్లను తొలగించేందుకు ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ డిమాండ్ చేసిందివిద్యుత్ శాఖ ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) ని కలిసి సీపీఐ నాయకులు గ్రామ దళితులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. పుట్టుపల్లె గ్రామ దళితులు గత 40 సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వ భూములను నమ్ముకుని, సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే, కోర్టు ఆదేశాల పేరుతో దళితుల భూముల్లో ఉన్న విద్యుత్ మీటర్లను తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేయడం అత్యంత విచారకరమన్నారు.