చంద్రశేఖరపురం: నడిరోడ్డుపై కారు దగ్ధమైన సంఘటన చంద్రశేఖరపురం మండలంలోని కంభంపాడు గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కంభంపాడు సమీపంలో రోడ్డుపై ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా ఒక్కసారిగా కారు ఇంజన్ లో పగలు రావడం గమనించి, అప్రమత్తమై కారు దిగి వెళ్లిపోయాడు. చూస్తున్న గాని కారు దగ్ధమై, మంటల్లో పూర్తిగా కాలిపోయింది. కారులోని వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.