చెన్నూరు: చెన్నూరు ఎస్బిఐ బ్యాంకులో జరిగిన చోరీని "సీన్ రీ కన్స్ట్రక్షన్" చేసిన పోలీసులు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎస్బిఐ బ్యాంకులో అధికారులే బంగారం, నగదు కాజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో మేనేజర్ మనోహర్ రెడ్డి, క్యాషియర్ నరిగె రవీందర్, తాత్కాలిక ఉద్యోగి లక్కాకుల సందీప్ లను కస్టడీకి తీసుకొని గురువారం ఉదయం పోలీసులు చెన్నూర్ ఎస్బిఐకి తరలించి "సీన్ రీ కన్స్ట్రాక్షన్" చేశారు. బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో బంగారం, నగదు ఎలా చోరీ చేశారో తెలుసుకునేందుకు వారిని ఇక్కడికి తీసుకొచ్చరు. కాజేసిన మొత్తం 20 కిలోల 250 గ్రాముల బంగారం, 1 లక్ష 16 వేల రూపాయలను పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే మొత్తం 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు.