చింతలపూడి: లింగపాలెం ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం: పటిష్ట భద్రత
లింగపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్ఐ వెంకన్నబాబు ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు భద్రత కల్పించారు. నామినేషన్ వేసే అభ్యర్థులతో పాటు ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.