ఆళ్లగడ్డ: భయాందోళనలో మాయలూరు గ్రామ ప్రజలు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వేరే చోటికి తరలించాలి
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామంలో రోడ్డు బుడదమయంగా ఉండటంతో చిన్నపిల్లలు, ప్రజలు నడవలేక ప్రమాదకరమైన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పక్కనుంచి వెళ్తున్నారు గతంలో రచ్చబండ కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా, పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు, ఈ ట్రాన్స్ ఫార్మర్ ను వెంటనే శివాలయం దగ్గరకు మార్చి ముప్పు తప్పించాలని విద్యుత్ శాఖ అధికారులు మాయలూరు గ్రామస్తులు వేడుకుంటున్నారు