గుంతకల్లు: అనంతపురంలో ఆటో చోరీ, గుత్తి అర్ఎస్ లోని రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్ళిన గుర్తు తెలియని దుండగులు
అనంతపురం నగరంలోని వన్ టౌన్ పరిధిలోని ఆటో చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు గుత్తి అర్ఎస్ లోని రైల్వే స్టేషన్ ఆవరణలో వదిలి వెళ్ళారు. అందుకు సంబంధించి స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నగరంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆటోను గుర్తు తెలియని దుండగులు ఈ నెల 19న చోరీ చేశారు. బాధిత ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో అనంతపురం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆటో చోరీ చేసిన ప్రాంతం నుంచి పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆటో చోరీ చేసుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.