కథలాపూర్: పితృపక్షాల్లో పెద్దలకు బియ్యం: పురోహితులు ప్రణీత్ శర్మ
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పితృపక్షాల్లో భాగంగా చనిపోయిన పూర్వీకుల పేరుమీద బియ్యం, కూరగాయలు వగైరా సమర్పించి ఆశీర్వచనాలు పొందుతున్నట్లు గ్రామ పురోహితులు ప్రణీత్ శర్మ తెలిపారు. దీంతో పితృదేవతలకు మోక్షం లభిస్తుందని, పితృపక్షాల్లో ఈ 15 రోజులు చనిపోయిన వాళ్లు భూమి మీదకు వచ్చి వారి కుటుంబ సభ్యులను దర్శిస్తారని పురాణాలు చెబుతున్నాయన్నారు. నేడు మహాలయ అమావాస్య చివరిరోజు కావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమారం,కథలాపూర్,మేడిపల్లి మండల ప్రజలు సైతం పెద్దలకు బియ్యాన్ని సమర్పించారు.