ఆత్మకూరు డివిజన్‌లోని ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో మూడవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ కొరత
ఆత్మకూరు డివిజన్‌లోని ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో మూడవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతోంది.తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్ద ట్రాక్టర్లు, పంట కోత మిషన్లు భారీగా క్యూల్లో నిలుస్తున్నాయి. డీజిల్, పెట్రోల్ క్యాన్లతో వినియోగదారులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్లే ఈ కొరత పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. వదంతులను నమ్మవద్దని ఆత్మకూరు ఆర్డీవో చంద్రగిరి వెంకటశివ సూచించారు.