ఎలమంచిలి: మునగపాక ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫాంల పంపిణీ
మునగపాక మండలం టి.శిరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు స్థానిక దాతలు మద్దాల ధనలక్ష్మి, నాగప్పారావు గారు ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేశారు. గత ఐదేళ్లుగా వీరు పాఠశాల అభివృద్ధికి బల్లలు మరియు ఇతర వసతులు కల్పిస్తూ తోడ్పాటు అందిస్తున్నారు.