ఆత్మకూరు పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరతపై పుకార్లను నమ్మవద్దు: ఆత్మకూరు RDO వెంకటశివుడు
ఆత్మకూరు, పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద గురువారం భారీగా రద్దీ నెలకొంది. రాబోయే మూడు నెలల వరకు పెట్రోల్, డీజిల్ సరఫరా ఉండదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే దీనికి కారణం. ఈ పుకార్లను నమ్మిన వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తడంతో ఆత్మకూరు-కర్నూలు ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో ఇంధన నిల్వలు నిలిచిపోతాయని, స్టాక్ అయిపోతుందనే తప్పుడు సందేశాలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఆందోళన చెందిన వాహనదారులు తమ ట్యాంకులను నింపుకోవడానికి, మరికొందరు బాటిల్స్‌లో నిల్వ చేసుకోవడానికి పోటీ పడ్డారు.