శ్రీశైలం: పారాక్వాట్ గడ్డిమందు పూర్తిగా నిషేధం.మందు అమ్మితే కఠిన చర్యలు. బండి ఆత్మకూరు ఏఓ పవన్ కుమార్.
పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు ప్రభుత్వం నిషేధించినట్లు బండి ఆత్మకూరు మండలం వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలిపారు. బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల బండి ఆత్మకూరు గ్రామాలలోని పురుగుమందుల దుకాణాలను ఏఓ పవన్ కుమార్ తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రాణానికి హాని కలిగించే ప్రమాదకరమైన పారాక్వాట్ డైక్లోరైడ్ అనే గడ్డిమందును దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారని, వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడిన నిపుణుల కమిటీ ఈ రసాయనాన్ని పూర్తిగా నిషేధించాలని సిఫారసు చేయడంతో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. పత్తి, వరి, మొక