కొండపి: సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరంలో పర్యటకుల తాకిడి, అప్రమత్తంగా వ్యవహరిస్తున్న అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరంలో పర్యటికల తాకిడి ఆదివారం నెలకొంది. సెలవు రోజు కావడంతో పర్యటకులు భారీగా సముద్ర తీరానికి వచ్చి సేద తీరుతున్నారు. వాతావరణం పొడిగా ఉండటం అలల ఉద్ధృతి కూడా చాలా తక్కువగా ఉండడంతో పర్యటకులు సముద్రంలో ఈత కొట్టేందుకు ఉత్సాహం చూపించారు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.