కథలాపూర్: మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్నదే లక్ష్యం: వైద్య బృందం
మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్నదే లక్ష్యమని క్లస్టర్ వైద్యాధికారుల బృందం పేర్కొన్నది. బుధవారం జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్ నారి స్వసక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఐదుగురు ప్రత్యేక వైద్య నిపుణులు ప్రజలకు చికిత్సలు చేశారు. 180 మందికి పరిక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగరాణి, శ్రీనివాస్, సింధూజ, రజిత, సీహెచ్వో వేణుగోపాల్ పాల్గొన్నారు.