సిరిసిల్ల: బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మూడవ మహాసభలు
సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ శివాలయంలో బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మూడవ మహాసభలు నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు జీవో నెంబర్ 12 ను ప్రభుత్వం వెంటనే సవరించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు. నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల సంక్షేమం కొరకు చేపట్టిన అనేక ఐక్య పోరాటాల ఫలితంగా 1996లో భవనం నిర్మాణ కార్మిక చట్టం ఏర్పడిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తం