ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు వివాదంలో ఉన్న ASF (D) కెరమెరి(M) లోని 14 గ్రామాలు అందరి దృష్టికీ వస్తాయి. ఇక్కడి ప్రజలకు రెండు రాష్ట్రాల ఓటర్ కార్డులు ఉంటాయి. వీళ్లు రెండు రాష్ట్రాలలోనూ సర్పంచ్‌లను, ఎమ్మెల్యేలను, ఎంపీలనూ వేరువేరుగా ఎన్నుకుంటారు. అయితే ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 గ్రామాల ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ స్థానిక ఎన్నికల్లో కూడా తమ ఓటు హక్కును వినియోగించనున్నారు.