శ్రీశైలం: సున్నిపెంటలో గాలివాన బీభత్సానికి లేచిపోయిన ఇంటి పై కప్పు . ప్రభుత్వమే ఆదుకోవాలి అంటున్న బాధితుడు
శ్రీశైలం ప్రాజెక్టులో నిన్న గాలివాన బీభత్సానికి శ్యాం కుమార్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు పూర్తిగా ద్వంశమైంది. అకస్మాత్తుగా వర్షం రావడంతో 3 నెలల క్రితం నిర్మించుకున్న ఇంటి రేకులు లేచిపోవటంతో పాటు నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. శ్రీశైలంలో పనులు చేసుకొని జీవించే శ్యాం కుమార్కు ఐదుగురు సంతానంలో ముగ్గురు తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఒక కుమార్తె మృతి చెందింది. ప్రభుత్వం సాయం అందించాలని బాధితుడు శ్యాం కుమార్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.