శ్రీశైలం: మహానంది ఆలయంలోని క్యులైన్ లో రక్త పింజరి పాము కలకలం. చాకచక్యంగా బంధించి అడవిలో వదిలిన స్నేక్ క్యాచర్ మోహన్
మహానంది దేవస్థానంలో శుక్రవారం రక్త పింజరి పాము ప్రత్యక్షమవడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆలయంలోని క్యూ లైన్లలో పాము సంచరిస్తుండటాన్ని గమనించిన భక్తులు వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అధికారులు స్నేక్ క్యాచర్ మోహన్‌ను ఘటనాస్థలానికి పిలిపించారు. ఆయన చాకచక్యంగా రక్త పింజరి పామును సురక్షితంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాలను అధికారులు పరిశీలించి, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.