గద్వాల్: గద్వాలలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ముదిరాజ్ సోదరుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీలు, ఇన్సూరెన్స్ గురించి ఈ సందర్భంగా వివరించారు.