శ్రీశైలం: మత్తు పదార్థాల నిర్మూలనకు కృష్ణాపురం గ్రామంలో వజ్రప్రహార్ పేరుతో కార్డెన్ సర్చ్ నిర్వహించిన ఆత్మకూరు పోలీసులు
నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాన్ ఆదేశాల మేరకు, ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ ఆధ్వర్యంలో 'ఆపరేషన్ వజ్రప్రహార్' పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా అమలాపురం, కృష్ణపురం తదితర ప్రాంతాల్లో 35 మంది సిబ్బందితో కలిసి ముమ్మరంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.అనుమానాస్పద ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలతో పాటు పాత నేరస్తుల నివాసాల్లో పోలీసులు సోదాలు చేశారు. రౌడీ షీటర్లను పిలిపించి సత్ప్రవర్తనతో మెలగాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం స్థానికులతో సమావేశం నిర్వహించే అవగాహన కల్పించారు.