కథలాపూర్: ఉపాధ్యాయుడి బదిలీపై గ్రామస్థుల నిరసన
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామస్థులు మంగళవారం MEO కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కరుణాకర్‌ను అనవసరంగా మరో పాఠశాలకు బదిలీ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగినంతమంది ఉపాధ్యాయులు ఉన్నారని,విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్ పై పంపించడం సరికాదని,బదిలీని తక్షణమే రద్దుచేయాలన్నారు.