కొడిమ్యాల: కొండగట్టు లో కారు ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం ఇరువురు భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,కొండగట్టు లో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటన మంగళవారం 8:30 PM కి చోటుచేసుకుంది,నిజామాబాద్ నుండి దసరా పండుగ నిమిత్తం కరీంనగర్ కి కారులో రమేష్ తో పాటుగా నలుగురు వెళుతుండగా,జగిత్యాల కు చెందిన ఇరువురు భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై కొత్తపల్లి వెళుతుండగా,కొండగట్టు కోటిలింగాల దారి కి వెళ్లే సమీపంలో వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది,దీంతో ద్విచక్ర వాహనం పైన ఉన్న ఇరువురు భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి,స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది,