పెందుర్తి: పరవాడ అరబిందో ఫార్మాలో అగ్నిప్రమాదం: సురక్షితంగా బయటపడిన సిబ్బంది
పరవాడ ఫార్మసిటీ అరబిందో యూనిట్-15లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. మెషీన్లను శుభ్రం చేస్తుండగా జరిగిన ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పింది. స్థిర విద్యుత్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.