అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 12:35 నిమిషాల సమయంలో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు వైద్య సిబ్బందితో కలిసి పరిసరాలన్నీ శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసరాలన్నీ శుభ్రం చేయడం జరిగిందని,అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం నందు చెత్త సేకరించే ఆటోను సైతం ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.