చిత్తడి నేలలను పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉంది: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
చిత్తడి నేలలను పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు వెట్ ల్యాండ్స్ రూల్స్-2017 ప్రకారం చిత్తడి నేల గుర్తింపు, సరిహద్దులు, నోటిఫికేషన్ చెయ్యాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏపీఎస్ఏసీ ద్వారా రంపచోడవరం డివిజన్లో 71వెట్ లాండ్స్ గుర్తించామన్నారు. వాటిపై నివేదిక ఇవ్వాలన్నారు.