శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో కార్డెన్సర్ నిర్వహించిన పోలీసులు. అనుమానితులు రౌడీషీటర్ల ఇళ్లలో సోదాలు
జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టి పత్రాలు లేని బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు, రౌడీషీటర్లు, గంజాయి మరియు అక్రమ మద్యం కేసుల నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మహిళల రక్షణపై అవగాహన కల్పించారు. అత్యవసర సహాయం కోసం 100, 112, సైబర్ ఫిర్యాదులకు 1930, బాలల సమస్యలకు 1098 నంబర్లను వినియోగించుకోవాలన్నారు.