గుంతకల్లు: గుత్తిలో పది మంది గంజాయి విక్రేతలు అరెస్ట్, 2.5 కిలోల గంజాయి, బంగారు గొలుసు, రూ.20వేలు నగదు స్వాధీనం
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్న పది మందిని గుత్తి పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని పోలీసు స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ వివరాలను గుత్తి సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ వెల్లడించారు. మండలంలో గంజాయి విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా మండలంలోని తురకపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయి, బంగారు, రూ.20వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.