పార్వతీపురం: పార్వతీపురం అభివృద్ధికి టీడీపీ అభ్యర్థులను గెలిపించండి: బెలగం జయబాబు పిలుపు
పార్వతీపురం పట్టణ అభివృద్ధి కోసం తెలుగుదేశం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగం జయబాబు, ఎమ్మెల్యే సతీమణి అనూష కోరారు. 20, 32 వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.