విశాఖపట్నం: విశాఖ వాల్తేర్ డిపో గేటు వద్ద హైర్ బస్ డ్రైవర్లు సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు
వాల్తేర్ డిపో గేటు వద్ద హైర్ బస్ డ్రైవర్లు సోమవారం ధర్నా నిర్వహించారు.. ఈ ధర్నాను ఉద్దేశించి ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటి యు అనుబంధం) వాల్తేరు డిపో గౌరవ అధ్యక్షుడు, CITU జిల్లా కార్యదర్శి పి. వెంకట్రావు మాట్లాడారు. హైర్ బస్ డ్రైవర్లకు జీతాలు అగ్రిమెంట్ పూర్తి అయి 11 నెలలకు కావస్తుందని ఇప్పటివరకు డ్రైవర్ల జీతాలు బస్సు ఓనర్స్ పెంచకపోవడం అన్యాయమని అన్నారు. ఒక ప్రక్క నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండగా ఇంటి అద్దె, కరెంట్ బిల్లు చార్జీలు విపరీతంగా పెరిగాయని జీతాలు మాత్రం పెరగలేదని దాని వలన హైర్ బస్సు డ్రైవర్లు అప్పుల పాలు అవుతున్నారు