శ్రీశైలం: ఆత్మకూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
ఆత్మకూరులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. నేడు నిర్వహించనున్న “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం సందర్భంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హాజరుకానుండగా, భారీ జన సమీకరణకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేపట్టారు. ఇదిలా ఉండగా, నిన్న ఆత్మకూరులోని శిల్పా చక్రపాణి రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. అనంతరం రాత్రి స్పందించిన శిల్పా చక్రపాణి రెడ్డి “దమ్ముంటే రా చూసుకుందాం” అంటూ సవాల్ విసిరారు.