శ్రీశైలం: ఆత్మకూరు పట్టణ శివారులోని ఉర్దూ ఉన్నత పాఠశాల ఎదురుగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి : SDPI పార్టీ డిమాండ్
ఆత్మకూరులోని నంద్యాల రోడ్డుపై ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత ఉర్దూ పాఠశాల ఎదుట విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని SDPI డిమాండ్ చేసింది.ఈ మేరకు SDPI శ్రీశైలం అసెంబ్లీ ఉపాధ్యక్షులు మాసూమ్ సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు ఈ రహదారిని దాటుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకముందే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని, వెంటనే స్పీడ్ బ్రేకర్లు మరియు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.