హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు నుండి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు రూ .49 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమంతుని పాడు మండలంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి సాధ్యమైనంతవరకు నిధులను రాబట్టి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.