శ్రీశైలం: బైర్లూటి చెంచుగూడెంలో దారుణం భార్యాభర్తల మధ్య గొడవ అడ్డొచ్చిన అత్తపై విల్లంబుతో దాడి చేసిన చెంచు యువకుడు
ఆత్మకూరు మండలం భైర్లుటి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పులిచెర్ల వెంకటేష్ అనే చెంచు గిరిజన యువకుడు అంబుతో భార్య వెంకటలక్ష్మి పై దాడి చేశాడు. భార్యపై అల్లుడుతో దాడి చేస్తుండగా అక్కడే ఉన్న అత్త గుల్ల కోటమ్మ అడ్డం రావడంతో ఆమె తొడ భాగంలో బాణం గుచ్చుకుంది. వెంకటేష్ భార్య వెంకటలక్ష్మి గత రెండు నెలల క్రితం ఓ మగ శిశువు కు జన్మనిచ్చింది అయితే రెండు నెలల నుంచి శిశువు నిమోనియా వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం శిశువుకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం తన కొడుకు ఆరోగ్యం బాగా లేకపోతే తన అత్త వాళ్ళు ఆసుపత్రిలో సరిగా చూపించకపోవడం వల్ల చనిపోయాడంటూ గొడవకు దిగాడు