మడకశిర మండలంలో శనివారం విషాదం. పదవ తరగతి బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య.
మడకశిర మండలం చత్రం పంచాయతీ దిగువ ఈచలడ్డి గ్రామంలో మనోజ్ కుమార్(15) అనే బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోజ్ కుమార్ మండలంలోని బుల్లసముద్రం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడని తండ్రి నాగరాజు తెలిపాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.