బోధన్: కుర్నపల్లి గ్రామంలో సంచరించిన నక్క
ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో గురువారం నక్క సంచారం గ్రామస్థులను కలవరపెట్టింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అడవిలో నుంచి దారి తప్పి గ్రామంలోకి నక్క ప్రవేశించి ఉండవచ్చునని గ్రామస్థులు భావిస్తున్నారు. గ్రామస్థులు తరిమివేయడంతో అది పొలిమేరల మీదుగా తిరిగి అడవిలోకి వెళ్లిందని భావిస్తున్నారు