సిద్దిపేట అర్బన్: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందన స్వీకరించి జాతీయ పతాకవిష్కరణ గావించి ప్రజలనుదేశించి ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించి, బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డా. అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, అదనపు కలెక్టర్