హిందూపురంలో అనధికారికంగా వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరిక
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో అనధికారికంగా వాహనాలపై ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని జర్నలిస్టులు కాని వారు నకిలీ విలేకరులు తిరుగుతున్నారని ప్రెస్ ముసుగులో అసాంఘిక శక్తులు తిరిగే ప్రమాదం ఉందని కాబట్టి ఇతరులు ఎవరైనా స్టిక్కర్లు వేసుకుంటే వారిపై కఠిన చర్యలు చేపట్టి వాహనం సీజ్ చేయబడుతుందని హిందూపురం డిఎస్పి మహేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. ఏ స్టిక్కర్ ఉన్న వాహన పత్రాలను, ఐడి కార్డులను, ధ్రువపత్రాలను చూపించాలని, వాహన తనిఖీలకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.