Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: ఆత్మకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ. ముఖ్య ఆతిదిగా పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి

Srisailam, Nandyal | May 4, 2026
ఆత్మకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 58 రోజులపాటు కఠిన నిరాహార దీక్ష చేసి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన బలిదానమే దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది అయిందన్నారు.గాంధేయవాదిగా అహింసా మార్గంలో పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం, ఆయన పట్టుదల నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆర్యవైశ్యుల ఆకాంక్షగా ఉన్న విగ్రహ ఏర్పాటు నేడు నెరవేరిందన్నారు.