గుంతకల్లు: గుత్తి మండలం ఎంగిలిబండ శివారులో జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు అదుపు తప్పి బోల్తా, నలుగురు యువకులకు గాయాలు
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని ఎంగిలిబండ గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు అదుపు తప్పి బోల్తా పడి నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం జక్కలచెరువు గ్రామానికి చెందిన సాదిక్ బాష, హర్షవర్ధన్, అనంతపురం కు చెందిన ధనుష్, విజయవాడకు చెందిన విజయ్ లు విజయవాడలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో యాడికిలో జరుగుతున్న తీరునాలకు వచ్చి రోడ్డు ప్రమాదం జరిగింది.