శ్రీశైలం: మహానంది క్షేత్ర అభివృద్ధికి పాండిచ్చేరికి చెందిన ఇంటాక్ సంస్థ సహకారం
మహానంది క్షేత్రం అభివృద్ధికి ఇంటాక్ సంస్థ సహకారం మహానంది ఏప్రిల్ 30 (నంది పత్రిక):- మహానంది క్షేత్రం అభివృద్ధికి ఇంటాక్ సంస్థ సహకారం అందిస్తున్నట్లు ఈవో శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.గురువారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు పాండిచ్చేరి రాష్ట్రం కు చెందిన ఇంటక్ సంస్థ అరుల్ బృందం ప్రతినిధులు మహానంది క్షేత్రంను సందర్శించారు. మహానంది క్షేత్రంలో క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలియజేశారు..యాత్రికుల సౌకర్యార్థం కల్పించాల్సిన అభివృద్ధి పనులు,సౌకర్యాలు తదితర వాటిపై అధ్యయనం చేశారు.ఆలయ అభివృద్ధిపై ఈవో వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, పర్యవేక్షకులు సుబ్బారెడ్డి, పాల్గొన్నారు