హిమాయత్ నగర్: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటను పరిశీలించిన మాజీ ఎంపీ హనుమంతరావు
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాట్లను మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఎంపీ హనుమంతరావు ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 12న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు. అలాగే ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని తెలిపారు.