గన్నవరం: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం బాపులపాడులో ధర్నా: ప్రభుత్వంపై డిమాండ్
జర్నలిస్టుల నేషనల్ డిమాండ్స్ డే సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడులో పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. ఇళ్ల స్థలాలు, ప్రమాద భీమా, వేజ్ బోర్డు అమలు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం వద్ద వినతిపత్రం అందజేశారు.