సోమందేపల్లిలో రంగయ్య విగ్రహం పెట్టాలి
సోమందేపల్లిలో సీనియర్ పాత్రికేయుడు రంగయ్య మరణం తీరని లోటని మండల విలేకరులు అన్నారు. మంగళవారం నక్కలగుట్ట వద్ద విలేకరులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ.. రంగయ్య ఎంతో మంచి మనిషని, ఆయన తమందరికీ ఆదర్శం అని అన్నారు. సోమందేపల్లిలో రంగయ్య విగ్రహం పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విలేకరులు మధు, బాబా, జగదీశ్, వాసు, ఆది, శ్రీనివాసులు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.